గత కొన్ని వారాలు నుంచి ఇండియన్ సినిమా దగ్గర వినిపిస్తున్న ఏకైక సినిమా పేరే ‘ధురంధర్’ (Dhurandhar). పెద్దగా హైప్ లేకుండానే వచ్చిన ఈ సినిమా ఈ సినిమా భారీ హైప్ లో వచ్చిన సినిమాల రికార్డులు సైతం లాంగ్ రన్ లో బద్దలు కొట్టి సింగిల్ లాంగ్వేజ్ లో రికార్డు వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో దుమ్ము లేపుతుంది కానీ చాలామంది ఓటిటి విడుదల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా పెద్ద సస్పెన్స్ నడుమ ఎట్టకేలకి అఫీషియల్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది.
Netflix revealed Dhurandhar date – నెట్ ఫ్లిక్స్ లో ధురంధర్ డేట్ వచ్చేసింది
దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా (Dhurandhar OTT date) డేట్ ని తమ యాప్ లో పొందుపరిచారు. ఈ సినిమా అనుకున్నట్టు గానే ఈ జనవరి 30 నుంచి అందుబాటులో ఉంటుంది అని ఖరారు చేసేసారు.
డేట్ వచ్చింది కానీ..
నెట్ ఫ్లిక్స్ లో ధురంధర్ (Dhurandhar) డేట్ అయితే వచ్చింది. కానీ ఇంకా తెలుగు, ఇతర డబ్బింగ్ వెర్షన్ లపై మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. చాలామంది డబ్బింగ్ వెర్షన్స్ కోసం కూడా చూస్తున్నారు. మరి ఇవి వస్తాయా లేదా అనేది రేపటితోనే తెలుస్తుంది.
Dhurandhar OTT Records – ఓటిటిలో రికార్డులు కూడా బద్దలవుతాయా?
ఇండియన్ సినిమా దగ్గర భారీ లాంగ్ రన్ ని చూసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ సినిమా మిస్ అవుతున్న హవా ఈ సినిమా చూపించింది. ఇక ఓటిటిలో కూడా హిందీ సినిమాలకి వైడ్ రీచ్ ఉంది. మరి ఇందులో కంటెంట్ దెబ్బతో ఓటిటి రికార్డులు కూడా బ్లాస్ట్ అవుతాయా లేదా అనేది చూడాల్సిందే.


