పేరు మార్చుకుంటున్న సమంత.. కొత్త పేరు ఇదేనా..?

పేరు మార్చుకుంటున్న సమంత.. కొత్త పేరు ఇదేనా..?

Published on Jan 29, 2026 9:00 PM IST

సమంత

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఇటీవల బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరుని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు 2025 డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక ఈ ఇద్దరు ప్రస్తుతం తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.

ఎక్కువ సమయం తన భర్తతో కలిసి ఉండేందుకు సామ్ ఇష్టపడుతుంది. బయటకు వెళ్లినా వీరిద్దరు కలిసి వెళ్తున్నారు. ఇక ప్రొఫెషనల్‌గా కూడా సామ్, రాజ్ కలిసే ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో నటిస్తోంది. నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు రాజ్ నిడిమోరు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని సమంత తన సొంత బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’పై ప్రొడ్యూస్ చేస్తుంది.

అయితే, సమంత త్వరలో తన పేరును మార్చుకోబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు సమంత రూత్ ప్రభు అని పిలువబడిన ఆమె, ఇకపై సమంత నిడిమోరు గా పేరు మార్చుకోనుందట. ఈ పేరును ‘మా ఇంటి బంగారం’ సినిమా టైటిల్ కార్డ్స్‌తో అందరి ముందుకు రానున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే సమంత కొత్త పేరుతో మన ముందుకు రాబోతుందా అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు