రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. రవికిరణ్ కొల్లా దర్శకత్వంలో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘రౌడీ జనార్థన’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు విజయ్. ఇక ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగానే తన నెక్స్ట్ చిత్రాన్ని దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో ప్రారంభించాడు. ఈ సినిమాకు ‘రణబాలి’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్.
ఈ రెండు సినిమాలు కూడా విజయ్ దేవరకొండకు ప్రెస్టీజియస్‌గా మారాయి. రెండు వైవిధ్యమైన జానర్లలో వస్తుండటంతో అభిమానుల్లో సైతం ఈ సినిమాలపై మంచి బజ్ ఏర్పడింది. అయితే, ఈ రెండు సినిమాలు పూర్తి కాకముందే ఇప్పుడు విజయ్ దేవరకొండ మరో డైరెక్టర్‌తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇష్క్, 24, మనం వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ కె కుమార్ విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటివరకు విజయ్ టచ్ చేయని కథతో ఈ సినిమా రాబోతుందని.. ఇందులో విజయ్ పాత్ర, పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ వార్తలపై హీరో, డైరెక్టర్ నుంచి ఎలాంటి అఫీషియల్ కామెంట్స్ రాలేదు. మరి నిజంగానే ఈ ఇద్దరి కాంబినేషన్ త్వరలో సెట్ కాబోతుందా..? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.


