Dhurandhar OTT Release : ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ధురంధర్’.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో యాక్షన్ జాతర మొదలు..!

Dhurandhar OTT Release : ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘ధురంధర్’.. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో యాక్షన్ జాతర మొదలు..!

Published on Jan 30, 2026 2:01 AM IST

Dhurandhar

బాలీవుడ్‌లో తెరకెక్కిన స్పై యాక్షన్ డ్రామా ‘ధురంధర్’ (Dhurandhar) బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించగా దర్శకుడు ఆదిత్యధర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకుల నుంచి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించగా సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్.మాధవన్ మరియు అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం కీలక పాత్రల్లో మెరిశారు. ఇంతమంది స్టార్ నటులు ఒకే సినిమాలో కనిపించడం ఈ చిత్రానికి అతిపెద్ద ఆకర్షణగా నిలిచింది. రణవీర్ సింగ్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ యాక్షన్ పెర్ఫార్మెన్స్‌ను ఇందులో కనబరిచారు. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఊపిరి బిగబట్టే ఉత్కంఠ ఈ సినిమా సొంతం.

Dhurandhar Box-Office Collections : బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట

‘ధురంధర్’ థియేటర్లలో విడుదలైనప్పటి నుండి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అద్భుతమైన వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ.1,300 కోట్లకు పైగా వసూలు చేసి, భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో చేరింది.

అయితే, ఇప్పుడు ధురంధర్ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం, నేటి(జనవరి 30) నుండి ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.

Dhurandhar in Telugu : తెలుగు ప్రేక్షకులకు ‘ధురంధర్’ గుడ్ న్యూస్

ఈ సినిమా థియేటర్లలో కేవలం హిందీలో మాత్రమే విడుదలైంది. అయితే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న వెర్షన్‌లో తెలుగు, తమిళ మరియు హిందీలో అందుబాటులోకి వచ్చింది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ యాక్షన్ చిత్రాన్ని తమ సొంత భాషలో వీక్షించే అవకాశం లభించింది.

మొదటి భాగం అందించిన భారీ విజయంతో, ఈ చిత్రానికి సీక్వెల్‌ను కూడా దర్శకుడు సిద్ధం చేశారు. ‘ధురంధర్ 2’ మార్చి 19, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు