షాకింగ్: ఓటిటిలో ‘ధురంధర్’ దారుణంగా డిజప్పాయింట్మెంట్.. కారణమిదే!

షాకింగ్: ఓటిటిలో ‘ధురంధర్’ దారుణంగా డిజప్పాయింట్మెంట్.. కారణమిదే!

Published on Jan 30, 2026 8:01 AM IST

Dhurandhar

ప్రస్తుతం ఇండియన్ ఆడియెన్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అవైటెడ్ ఓటిటి రిలీజ్ ఏదన్నా ఉంది అంటే అది “ధురంధర్” (Dhurandhar) కోసమే అని చెప్పాలి. రణ్వీర్ సాంగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డు వసూళ్లు సొంతం చేసుకుని ఫైనల్ గా ఇవాళ్టి నుంచి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది. కానీ అనూహ్యంగా నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక ఆడియెన్స్ ని దారుణంగా డిజప్పాయింట్ చేసింది అని అంటున్నారు. అయితే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. Dhurandhar Runtime Trimmed? – నిడివి తగ్గించేయడం..

ఒరిజినల్ గా ధురంధర్ (Ranveer Singh Dhurandhar) చిత్రం థియేటర్స్ లో 3 గంటల 34 నిమిషాల రన్ టైం తో విడుదల అయ్యింది. కానీ ఊహించని విధంగా నెట్ ఫ్లిక్స్ లో మాత్రం కేవలం 3 గంటల 20 నిమిషాల నిడివితోనే వచ్చింది. దీనితో అసలు 14 నిమిషాలు ఎందుకు కట్ చేసేసారు అంటూ సోషల్ మీడియాలో మూవీ లవర్స్ తమ నిరాశని వ్యక్తం చేస్తున్నారు.

2. బోల్డ్ కంటెంట్ మిస్..

అసలు ఓటిటి అంటేనే బోల్డ్ కంటెంట్.. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకపోవడం. ఇలానే థియేటర్స్ లో రిలీజ్ చేసిన వెర్షన్ లో లేని కంటెంట్ ని కూడా ఇందులో ఆశించారు అంతా. కానీ ఊహించని విధంగా ఓటిటి వెర్షన్ లో అవి లేకపోగా డైలాగులు కూడా మ్యూట్ చేసేయడంతో ధురంధర్ అన్ కట్ వెర్షన్ (Dhurandhar Uncut Version on OTT) ని ఇక్కడైనా చూద్దాం అనుకున్న ఆడియెన్స్ దారుణంగా డిజప్పాయింట్ అయ్యినట్టు చెబుతున్నారు.

ఇలా ప్రధానంగా ఈ రెండు అంశాలు మాత్రం ఓటిటిలోకి వచ్చాక ఆడియెన్స్ ని ఒకింత షాక్ కి లోను చేసి డిజప్పాయింట్ చేసాయి.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు