స్టార్ కొరియోగ్రఫర్ కమ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ రాఘవ లారెన్స్ కెరీర్‌లో ‘కాంచన’(Kanchana) ఎలాంటి సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రాన్ని లారెన్స్ స్వయంగా డైరెక్ట్ చేశారు. ఇక హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. 2011లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. ఈ సినిమాను 2026 మార్చి 13న థియేటర్లలో రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాను ఇప్పుడు డాల్బీ అట్మోస్‌లో వీక్షించవచ్చని మేకర్స్ తెలిపారు. రాఘవ లారెన్స్ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో పాటు హారర్ అంశాలు మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడం ఖాయం.
ఇక ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, శరత్ కుమార్, కోవై సరళ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మరి ఈ సినిమా రీ-రిలీజ్‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.



