భారీ మల్టీస్టారర్ కమల్, రజినీ ప్రాజెక్ట్ కోసం ఊహించని డైరెక్టర్ లాక్!?

భారీ మల్టీస్టారర్ కమల్, రజినీ ప్రాజెక్ట్ కోసం ఊహించని డైరెక్టర్ లాక్!?

Published on Jan 30, 2026 10:00 AM IST

Kollywood epic Multistarrer

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర పాన్ ఇండియా చిత్రాలు, సీక్వెల్స్ ఇంకా ప్రీక్వెల్ సినిమాలతో పాటుగా మల్టీ స్టారర్ చిత్రాలు కూడా వస్తున్నాయి. ఇలా ఓ క్రేజీ మల్టీస్టారర్ చిత్రమే గత కొన్నాళ్ల కితం ఒక్కసారిగా సెన్సేషన్ గా మారింది. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth), కమల్ హాసన్ (Kamal Haasan) లు కలిసి కనిపించే సినిమా అది.

ఇప్పుడు ఇద్దరి కలయికలో కమల్ నిర్మాణం వహిస్తున్న సినిమా కూడా ఉంది కానీ అది కాకుండా ఇద్దరు కలిసి కనిపించే సినిమా కోసం మళ్ళీ తమిళ సినీ వర్గాల్లో టాక్ మొదలైంది. దీని ప్రకారం జైలర్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ భారీ ప్రాజెక్ట్ ని టేకోవర్ చేసినట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

దీనితో పాటుగా నెల్సన్ ఆల్రెడీ వీరిపై ఓ అనౌన్సమెంట్ కట్ లాంటిది సిద్ధం చేస్తున్నాడని కానీ ఈ ప్రాజెక్ట్ మొదలయ్యేందుకు చాలా సమయమే పట్టొచ్చని తెలుస్తుంది. ఇప్పుడు చేస్తున్న జైలర్ 2 కాకుండా తెలుగులో ఓ సినిమా చేయాల్సి ఉండగా అది అయ్యాక ఈ భారీ ప్రాజెక్ట్ ని తాను చేసే ఛాన్స్ ఉన్నట్టు కొత్త రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు