మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సాలిడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు 9mana shankara vara prasad garu) కోసం తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఈ ఫెస్టివల్ సీజన్ కి రికార్డ్ గ్రాసర్ గా నిలిచింది. ఇలా మంచి లాంగ్ రన్ ని కంప్లీట్ కొనసాగిస్తున్న ఈ సినిమా రీజనల్ గా ఎన్నో రికార్డులు సెట్ చేసింది. ఇక లేటెస్ట్ గా మరో భారీ రికార్డ్ ఈ సినిమా సెట్ చేసింది.
బుకింగ్స్ లో రీజనల్ గా ఆల్ టైం హైయెస్ట్ నెంబర్ టికెట్ సేల్స్ ఈ సినిమా చేసుకుంది. కేవలం బుక్ మై షో యాప్ లో 3.7 మిలియన్ కి పైగా టికెట్స్ ఈ సినిమాకి అమ్ముడుపోయాయని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో మన శంకర వరప్రసాద్ గారు రీజనల్ గా మరో భారీ ఫీట్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా వెంకీ మామ మంచి కామియోలో కూడా కనిపించారు. అలాగే షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.


