ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. స్లోగానే తెరకెక్కుతున్నప్పటికీ ఈ ఔట్ పుట్ పరంగా మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు. అందుకే కొంచెం ఆలస్యం అయినప్పటికీ గట్టి సౌండ్ నే ఇస్తారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో మలయాళ ప్రముఖ నటుడు టోవినో థామస్ కూడా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే తనపై ఓ క్రేజీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో తన సాలిడ్ ఫిట్నెస్ లెవెల్స్ ని తను చూపిస్తుండగా దీనితో పాటుగా తన మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ కూడా చూపిస్తున్నాడు. నాంచాక్ తో విన్యాసాలు చేస్తూ కనిపించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో ఈ ట్రైనింగ్ అంతా ఎన్టీఆర్ సినిమా కోసమే అన్నట్టు టాక్ మొదలైంది. మరి ఇది ఆ సినిమా కోసమేనా లేక మరో సినిమా కోసమా అనేది వేచి చూడాల్సిందే.


