మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం భర్త మహాశయులకు సంక్రాంతి కానుకగా వచ్చి అలరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన నుంచి అనౌన్స్ అయ్యిన సినిమానే ఇరుముడి. ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే మంచి పాజిటివ్ వైబ్స్ ని సొంతం చేసుకుంది.
ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నట్టు తెలుస్తోంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ తదితర ముఖ్య తారాగణంతో ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది అని తెలుస్తోంది. రవితేజ సినిమాలు ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ అవుతాయో తెలిసిందే. అలానే ఇది కూడా కంప్లీట్ అవుతుంది. ఇక ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.


