నాగార్జున ల్యాండ్‌మార్క్ మూవీ.. వచ్చేది అప్పుడేనా..?

నాగార్జున ల్యాండ్‌మార్క్ మూవీ.. వచ్చేది అప్పుడేనా..?

Published on Jan 31, 2026 7:07 PM IST

Nagarjuna

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ ప్రాజెక్ట్ నుంచి చిత్ర బృందం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. దీంతో సినిమా పట్ల విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ ఏడాది వేసవి చివరి నాటికి ఈ చిత్ర షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి, దసరా కానుకగా సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విడుదల తేదీ మరియు ఇతర విశేషాలను సరైన సమయంలో స్వయంగా నాగార్జునే ప్రకటించనున్నాడట. షూటింగ్ పూర్తయిన తర్వాత అన్ని ప్లాట్‌ఫారమ్‌లలో భారీ ఎత్తున ప్రమోషన్లు నిర్వహించేందుకు ఆయన ఇప్పటికే గ్రాండ్ ప్లాన్స్ సిద్ధం చేసినట్లు చిత్ర వర్గాల టాక్.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘రాక్‌స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ 100వ చిత్రం విషయంలో నాగార్జున ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. తన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే ఈ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు