హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’(Swayambhu) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడిక్ చిత్రంగా మేకర్స్ రూపొందిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ పై హీరో నిఖిల్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. ఈ సినిమా టీజర్ అనౌన్స్‌మెంట్ ఈ వారంలో ఉండబోతుందని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ సినిమా కోసం తాను గత రెండేళ్లుగా ఎంతో తీవ్రంగా కష్టపడుతున్నాడని.. ఐస్ క్రీమ్‌కి దూరంగా ఉన్నానని.. అయితే, ఇప్పుడు యాక్షన్ సీక్వెన్స్‌లు అన్నీ పూర్తికావడంతో తన చిత్ర యూనిట్ తనకు ఐస్ క్రీమ్ తినిపించారంటూ ఓ వీడియోను పోస్ట్ చేశాడు.
మొత్తానికి ‘స్వయంభు’ చిత్ర టీజర్ పై నిఖిల్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
Finally an Ice Cream after
2 years of Warrior Diet , 2 years of Training
Throwback to When my Staff got me an Icecream on the Wrap of Swayambhu Action Shoot.Teaser announcement loading this week 🔥 pic.twitter.com/6XiSbY2FAG
— Nikhil Siddhartha (@actor_Nikhil) January 31, 2026


