లెజెండరీ డైరెక్టర్ కొత్త సినిమాను అనౌన్స్ చేసిన వైజయంతి మూవీస్

లెజెండరీ డైరెక్టర్ కొత్త సినిమాను అనౌన్స్ చేసిన వైజయంతి మూవీస్

Published on Jan 31, 2026 7:56 PM IST

Singeetham Sreenivasa Rao

ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఏదైనా సినిమా వస్తుందంటే యావత్ తెలుగు ప్రేక్షకుల్లో ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇక ఈ బ్యానర్ నుంచి తాజాగా ఓ సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ రావడంతో ప్రేక్షకులు అలర్ట్ అయ్యారు.

టాలీవుడ్‌లో వైవిధ్యమైన సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస రావు గురించి అందరికీ తెలిసిందే. ఆయన తెరకెక్కించిన చిత్రాలు, అవి సాధించిన రికార్డులు తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయాయి. అయితే, చాలా గ్యాప్ తర్వాత ఈ లెజెండరీ డైరెక్టర్ ఇప్పుడు మరో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన కెరీర్‌లో 61వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమాను #SSR61 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ నిర్మాణం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ అనౌన్స్ చేయడంతో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అనే చర్చ మొదలైంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు