‘ఉస్తాద్ భగత్ సింగ్’ బిగ్ అప్డేట్‌కు టైమ్ ఫిక్స్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ బిగ్ అప్డేట్‌కు టైమ్ ఫిక్స్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!

Published on Feb 4, 2026 1:00 PM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. గతంలో ‘గబ్బర్‌సింగ్’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఈ కాంబినేషన్‌లో మరోసారి ఈ సినిమా వస్తుండటంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓ బిగ్ అప్డేట్ నేడు రానుంది. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు. నేడు సాయంత్రం 4.15 గంటలకు ఈ బిగ్ అప్డేట్ రాబోతుంది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు ఉండనుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. శ్రీలీల, రాశి ఖన్నా ఈ సినిమాలో హరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు