జోర్డాన్‌లో జూనియర్ జోరు.. యాక్షన్‌తో అదరగొట్టనున్న ‘డ్రాగన్’

జోర్డాన్‌లో జూనియర్ జోరు.. యాక్షన్‌తో అదరగొట్టనున్న ‘డ్రాగన్’

Published on Feb 6, 2026 1:00 AM IST

NTR Neel

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్ర నెక్స్ట్ షెడ్యూల్ జోర్డాన్‌లో షూటింగ్ జరుపుకోనుంది. దీనికోసం చిత్ర యూనిట్ ఇప్పటికే అక్కడ లొకేషన్స్ ఫైనల్ చేశారు. ఫిబ్రవరి నెలలో జరగబోయే ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై మూడు అత్యంత భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.

ఈ సినిమాలో తారక్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ మరియు ఫిజిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జోర్డాన్ షెడ్యూల్‌లో చిత్రీకరించబోయే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకే హైలైట్‌గా ఉండనున్నాయట. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

మలయాళ నటుడు టోవినో థామస్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు