టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) క్రేజ్ అంతర్జాతీయ స్థాయిలో మరోసారి మారుమోగిపోతుంది. తాజాగా జపాన్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ ‘అనన్’ కవర్ పేజీపై ప్రభాస్ చోటు సంపాదించి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఫిబ్రవరి 10న విడుదల కానున్న ఈ మ్యాగజైన్ 2483వ సంచిక బ్యాక్ కవర్‌పై ప్రభాస్ మెరిశారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారతీయ నటుడిగా ఆయన రికార్డు సృష్టించడం విశేషం.
గతంలో ‘RRR’ సినిమా సృష్టించిన సంచలనంతో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించారు. అయితే, ఒక భారతీయ నటుడు సోలోగా ఈ మ్యాగజైన్ కవర్‌పై నిలవడం మాత్రం ప్రభాస్‌తోనే మొదలైంది. “ఇర్రెసిస్టబుల్ ఫీలింగ్స్” అనే థీమ్‌తో రూపొందిన ఈ సంచికలో ప్రభాస్‌ను “రాయల్ ఆడియన్స్ గ్రావ్యూర్” అని అభివర్ణించారు.
డిసెంబర్ 2025లో తన సినిమాల ప్రమోషన్ కోసం టోక్యో పర్యటించిన సమయంలో ప్రభాస్ ఈ ఫోటో షూట్‌లో పాల్గొన్నారు. ఈ వార్త తెలియడంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


