పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్'(Spirit). సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక సెట్ వేస్తున్నారట. ఈ సెట్ లో రెండు వారాల పాటు ప్రభాస్ క్యారెక్టర్ పై యాక్షన్ సీక్వెన్స్ లను షూట్ చేస్తారట. ప్రముఖ స్టంట్ డైరెక్టర్ పీటర్ హెయిన్ నేతృత్వంలో ప్రభాస్ పై ఈ ఫైట్స్ చిత్రీకరిస్తారట.
కాగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. మొత్తానికి ఈ యాక్షన్ ఫ్లాష్ బ్యాక్ సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ గా ఉంటుందట. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.


