మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రమే “పెద్ది”. మల్టీ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఇంటెన్స్ రోల్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి ఆల్రెడీ వచ్చిన మొదటి పాట చికిరి చికిరి 250 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అయ్యింది.
ఇక ఈ సాంగ్ తర్వాత రెండో సాంగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి రీసెంట్ గా మేకర్స్ చిన్న హింట్స్ ఇస్తూ వస్తున్నారు. అయితే ఈ వాలెంటైన్స్ డే కానుకగా రెండో పాట రావచ్చు అనే బజ్ వినిపించింది కానీ లేటెస్ట్ గా మాత్రం ఈ రెండో సాంగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇది నిజం అయితే ఫ్యాన్స్ కి మరింత నిరాశ తప్పదని అనుకోవాలి. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.


