అల్లు అర్జున్ 42 రూల్స్ పచ్చి అబద్దం.. చర్యలు తప్పవు!

అల్లు అర్జున్ 42 రూల్స్ పచ్చి అబద్దం.. చర్యలు తప్పవు!

Published on Feb 11, 2026 7:09 PM IST

Allu-Arjun-1

ప్రస్తుతం ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా వైడ్ గా మీడియా వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పేరు ఇప్పుడు వినిపిస్తూ వస్తుంది. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై పలు పుకార్లు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందుతున్నాయి. అల్లు అర్జున్ పై మొదట ఓ షాకింగ్ స్టేట్మెంట్ బయటకి వచ్చింది. దాని తర్వాత ఏకంగా ఓ పెద్ద లిస్ట్ తన 42 రూల్స్ అంటూ కొన్ని లైన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

అయితే అసలు వీటిపై అల్లు అర్జున్ టీం నుంచి ఓ క్లారిటీ వచ్చింది. అల్లు అర్జున్ 42 రూల్స్ పెట్టుకున్నారు అనే మాట పచ్చి అబద్దం, ఫేక్ అని టీం ఖండించారు. ట్విట్టర్ లో అది ఎవరో కావాలని సృష్టించింది మాత్రమే అని అతను ఎవరు అనేది కూడా గుర్తించామని ఆపై చర్యలు తమ బృందం పోలీస్ వారితో కలిసి తీసుకుంటున్నట్టుగా తెలిపారు. సో ఆ 42 రూల్స్ అనే మాట అబద్దం అని తేలింది. ఇక ఈ కేసుకి సంబంధించి ఆ వ్యక్తి ఎవరు ఎందుకు ఇలా చేశారు? అనేవి మాత్రం బయటకి రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు