థ్రిల్లర్ మోడ్ లోకి వచ్చిన శ్రీవిష్ణు.. టీజర్ పై రాజమౌళి కామెంట్స్ వైరల్

థ్రిల్లర్ మోడ్ లోకి వచ్చిన శ్రీవిష్ణు.. టీజర్ పై రాజమౌళి కామెంట్స్ వైరల్

Published on Feb 11, 2026 7:27 PM IST

Mrithyunjay

మన టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రామిసింగ్ హీరోస్ లో కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు కూడా ఒకరు. అయితే శ్రీవిష్ణు గత కొంత కాలం నుంచి సాలిడ్ ఎంటర్టైనర్స్ ని మాత్రమే చేస్తూ వస్తున్నారు. కానీ తన కెరీర్ కోసం తెలిసినవారు అయితే తన లైనప్ లో సాలిడ్ థ్రిల్లర్స్ ని కూడా చూసారు. ఇలా మంచి కామెడీ సినిమాలు తర్వాత తన నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రమే ‘మృత్యుంజయ్’.

ఇక ఈ సినిమా తాలూకా టీజర్ ని చూసి గ్లోబల్ దర్శకుడు ఇప్పుడు వారణాసి (Varanasi Movie) చేస్తున్న ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) కూడా తన రెస్పాన్స్ అందించగా వైరల్ గా మారింది. ఇక ఈ టీజర్ చూస్తే మాత్రం మళ్ళీ శ్రీవిష్ణు కంప్లీట్ గా థ్రిల్లర్ మోడ్ అండ్ మూడ్ లోకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఒక మనిషి మూడు విషయాలు మార్చుకోలేడు అంటూ మొదలైన ఈ టీజర్ మంచి థ్రిల్లింగ్ అండ్ గ్రిప్పింగ్ విజువల్స్ తో కొనసాగుతుంది.

శ్రీవిష్ణు తన రోల్ లో చార్మింగ్ లుక్స్ తో కనిపిస్తుండగా హీరోయిన్ రెబా మోనికా జాన్ కి కూడా మంచి రోల్ ఇందులో పడినట్టు కనిపిస్తుంది. ఇక ఇందులో కాల భైరవ సంగీతం కూడా మరో ఎసెట్ అని చెప్పొచ్చు. అలాగే దర్శకుడు శ్రీ హుస్సేన్ షా కిరణ్ ఆడియెన్స్ కి ఓ గ్రిప్పింగ్ థ్రిల్లర్ ని అందించే ప్రామిస్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. మరి ఈ ఫుల్ లెంగ్త్ సినిమా వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. అందుకు ఈ ఫిబ్రవరి 27 వరకు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాని లైట్ బాక్స్ మీడియా వారు నిర్మాణం వహించారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు