బన్నీవాస్, వంశీ నందిపాటి సమర్పణలో సుహాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హే భగవాన్’. శివానీ నగరం హీరోయిన్‌గా, గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ‘నాట్ ఏ ట్రైలర్’ (Not a Trailer) పేరుతో నిర్వహించిన వినూత్న వేడుకకు మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు.
ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పంచుతోందని, సుహాస్ కష్టపడే తత్వం ఈ చిత్రానికి విజయాన్ని చేకూరుస్తుందని సాయి దుర్గ తేజ్ ఆకాంక్షించారు. ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసి తాను ఎంతో ఎంజాయ్ చేశానని బన్నీవాస్ తెలిపారు. కథలోని ప్రధాన పాయింట్‌ను థియేటర్‌లోనే చూడాలనే ఉద్దేశంతో ట్రైలర్‌లో రివీల్ చేయలేదని, కథను ఊహించిన వారికి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బహుమతి కూడా ఇస్తున్నామని వంశీ నందిపాటి పేర్కొన్నారు. తండ్రీకొడుకుల ఎమోషన్‌తో సాగే ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని హీరో సుహాస్, దర్శకుడు గోపీ అచ్చర నమ్మకం వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు నరేష్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు.


