మెగా హీరో ప్రేమకథకు ఎసరు పెట్టిన డైరెక్టర్..?

మెగా హీరో ప్రేమకథకు ఎసరు పెట్టిన డైరెక్టర్..?

Published on Feb 13, 2026 8:00 AM IST

Sai-Durga-Tej

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన బ్రేకప్‌పై చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుహాస్ నటించిన ‘హే భగవాన్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న తేజు, తన ప్రేమ కథకు దర్శకుడు రామ్ అబ్బరాజు ప్రత్యక్ష సాక్షి అని పేర్కొన్నారు. రామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఈ సరదా సంభాషణకు వేదికైంది.

తేజు మాట్లాడుతూ.. “నా లవ్ స్టోరీ బ్రేకప్ అవ్వడానికి కారణం వీడే” అంటూ రామ్ అబ్బరాజుపై సరదాగా బాంబు పేల్చారు. దీనికి రామ్ స్పందిస్తూ.. ఆవిడ ఒక హీరోయిన్ అని, ఆమె భాష కూడా తమకు రాదని హింట్ ఇచ్చారు. తమ మధ్య ఉన్న చనువుతో ఒకరిపై ఒకరు జోకులు వేసుకోవడంతో అక్కడ నవ్వులు పూశాయి.

ప్రస్తుతం 40లో ఉన్న తేజు ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో, ఆయన ప్రస్తావించిన ఆ హీరోయిన్ ఎవరై ఉంటారా అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. గతంలో తేజుపై వచ్చిన రూమర్లను ఈ వ్యాఖ్యలు మళ్ళీ గుర్తు చేయడమే కాకుండా, వీరిద్దరి మధ్య నడిచిన ఈ ‘ట్రయాంగిల్’ కామెడీ హాట్ టాపిక్ గా మారింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు