సమీక్ష: ‘కపుల్ ఫ్రెండ్లీ’ – ఆకట్టుకునే ఎమోషనల్ ఎంటర్టైనర్

సమీక్ష: ‘కపుల్ ఫ్రెండ్లీ’ – ఆకట్టుకునే ఎమోషనల్ ఎంటర్టైనర్

Published on Feb 14, 2026 2:12 AM IST

couple-friendly-Movie-1

విడుదల తేదీ : ఫిబ్రవరి 14, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు : సంతోష్ శోభన్, మానస వారణాసి, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ రాజు మరియు తదితరులు
దర్శకుడు : అశ్విన్ చంద్రశేఖర్
నిర్మాణం : యూవీ కాన్సెప్ట్స్
సంగీత దర్శకుడు : ఆదిత్య రవీంద్రన్
సినిమాటోగ్రాఫర్ : దినేష్ పురుషోత్తమన్
ఎడిటర్ : గణేష్ శివ

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన కొత్త చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక ఇంటీరియర్ డిజైనర్ కావాలని కెరీర్ పరంగా స్ట్రగుల్ అవుతూ కుటుంబాన్ని వదిలేసి నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళిపోతాడు శివ (సంతోష్ శోభన్). అదే చెన్నైలో తన కుటుంబం ఒత్తిడి పెడుతుంది అని పెళ్లి నుంచి తప్పించుకుంటూ జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నానని చెప్పి ఉంటుంది మిత్ర (మానస వారణాసి). మరి ఈ ఇద్దరూ ఎలా కలిశారు? కలిసిన తర్వాత వీరి జీవితాలు ఎలా మారాయి. ఇద్దరూ లైఫ్ లో సెటిల్ అయ్యారా లేదా? ఈ క్రమంలో శివ కోల్పోయి మిగుల్చుకుంది ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో ప్రధానంగా కథనం ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంది అని చెప్పొచ్చు. సినిమా మొదలైన కొన్ని నిమిషాలకే ఆడియెన్స్ లీనం అవుతారు. చాలా సింపుల్ అండ్ చాలామందికి రిలేటెడ్ గా కనిపించే సన్నివేశాలు బాగున్నాయి. ఇలా ఫస్టాఫ్ అంతా నీట్ గా వెళుతూ నెమ్మదిగా మంచి కామెడీ డోస్ ని కూడా పెంచుకుంటుంది. ఇలా కొన్ని డీసెంట్ మూమెంట్స్ తో పాటుగా మంచి ఫన్ కూడా ఇంటర్వెల్ కి వెళ్లేసరికి ఆడియెన్స్ కి దక్కుతుంది.

ఇంకోపక్క ఇద్దరి జంటపై నాన్ లీనియర్ గా కనిపించే మరో వెర్షన్ కూడా ఆడియెన్స్ లో ఉత్సుకతని నెలకొల్పుతుంది. ఎందుకు ఇద్దరూ ఓ చోటికి వెళ్లి ఏం చేస్తున్నారు అనే సస్పెన్స్ చిన్నగా మైంటైన్ కావడం బాగుంది. ఇలా ఓ డీసెంట్ ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ మాత్రం మంచి ఎమోషనల్ టర్న్ ని తీసుకుంది.

ఈ ఎమోషనల్ పార్ట్ లో మాత్రం నటీనటులు పెర్ఫామెన్స్ లతో సినిమాని మరింత కనెక్ట్ అయ్యేలా చేశారు. ముఖ్యంగా యువ హీరో సంతోష్ శోభన్. తన గత సినిమాలు అన్నిటితో పోలిస్తే ఈ చిత్రంలో తన పెర్ఫామెన్స్ మాత్రం చాలా బాగుంది, అంతే కాకుండా చాలా బెటర్ గా కూడా ఉంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, తన ప్రేయసి విషయంలో కొన్ని సీన్స్ లో తన నటన చూసే ఆడియెన్స్ ని కదిలిస్తాయి.

తన పాత్ర ఉండే పరిస్థితిని బట్టి తన మేకోవర్ కూడా బాగా మైంటైన్ చేసాడు. ఇక తనతో పాటుగా హీరోయిన్ మానస వారణాసి మంచి పాత్ర ఈ సినిమాలో దక్కించుకుంది. ఆమె పలికే మాటలు, చెప్పే ఫిలాసఫి అందులో అర్ధం ఆలోచించేలా చేస్తాయి. ఇద్దరి జంట కూడా ఆన్ స్క్రీన్ పర్ఫెక్ట్ గా కుదిరింది వారి కెమిస్ట్రీ కూడా బాగుంది. ఇక వీరితో పాటుగా గోపరాజు రమణ రాజు, రాజీవ్ కనకాల పాత్రలు అందులో వారి నటన బాగున్నాయి. యోగిబాబుకి కూడా మంచి పాత్ర ఇందులో కనిపిస్తుంది. ఇలా ఎవరి పాత్రలకి తగ్గట్టుగా వారు మంచి ప్రతిభ కనబరిచారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కథనం బాగుంది కానీ ఊహాజనితంగానే సాగుతుంది. సో మరీ కొత్తదనం లాంటివి కోరుకుంటే కొంచెం డిజప్పాయింట్ అవుతారు. అంతేకాకుండా ఇందులో ఇచ్చే ముగింపు కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది అని చెప్పలేం. ఈ చిత్రాన్ని రెండు గంటలే ప్లాన్ చేశారు.

అయితే ఇందులో మొదట కపుల్ తాలూకా స్ట్రగుల్ ని సక్సెస్ ని ప్రెజెంట్ చేసిన రీతిలో వాటి తర్వాత ఇద్దరి మధ్య అసలైన ప్రేమని కూడా ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. కొంచెం టైం తీసుకొని వారి నడుమ ప్రేమని కూడా చూపించి ఉంటే బాగుండేది. ఇద్దరి నడుమ కేవలం డేటింగ్, రిలేషన్ షిప్ లాంటివే చూపించారు కానీ ఒక టైం తర్వాత కావాల్సిన లవ్ యాంగిల్ ని కొంచెం తక్కువ టచ్ చేసినట్టు అనిపిస్తుంది.

వీటితో పాటుగా ఓయ్, దిల్ బెచారా లాంటి కొన్ని సినిమాలు మధ్యలో గుర్తొస్తాయి. అలాగే సినిమాలో కొన్ని తమిళ, మలయాళ డైలాగ్ లు ఆరంభంలో ఉన్నాయి కానీ వాటికి సబ్ టైటిల్స్ లాంటివి యాడ్ చేయలేదు. ఇవి కూడా యాడ్ చేసి ఉంటే తెలుగు ఆడియెన్స్ కి ఇంకాస్త బాగా అర్ధం అయ్యేది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. యూవీ కాన్సెప్ట్స్ వారు మంచి నిర్మాణ విలువలు అందించారు. ఈ సినిమాలో మ్యూజిక్ మరింత కీలక పాత్ర పోషించింది. దీనిని ఆదిత్య రవీంద్రన్ చాలా బాగా అందించారు. అలాగే దినేష్ పురుషోత్తమన్ మంచి కెమెరా వర్క్ అందించారు. గణేష్ శివ ఎడిటింగ్ కూడా బాగుంది.

ఇక దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ విషయానికి వస్తే.. తన వర్క్ ఈ సినిమాలో బాగుంది. తాను సినిమాలో సోల్ ని ప్రెజెంట్ చేయడం సక్సెస్ అయ్యారు. చెప్పాలనుకున్న ఎమోషన్ ని ఎక్కడా బోర్ లేకుండా ప్రెజెంట్ చేసిన విధానం బాగుంది. ఇద్దరి జంటకి ప్రతిబింబంగా రెండు పక్షులని కూడా చూపిస్తూ మంచి సింబాలిజం చూపించడం ఇంప్రెస్ చేస్తుంది. అలాగే కామెడీ, ఎమోషన్స్, పాత్రల స్ట్రగుల్, సక్సెస్ ని బ్యాలన్స్డ్ గా మైంటైన్ చేశారు. కానీ లీడ్ జంట మధ్య లవ్ స్టోరీని కూడా సెకండాఫ్ లో స్కోప్ తీసుకొని పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. అయినప్పటికీ తన వర్క్ మెప్పిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఆడియెన్స్ ని ఆకట్టుకునే డీసెంట్ ఎమోషనల్ ఫ్లిక్ అని చెప్పొచ్చు. సంతోష్ శోభన్, మానస వారణాసి మెచ్యూర్ పెర్ఫామెన్స్ లతో ఇంప్రెస్ చేశారు. అలాగే డీసెంట్ కామెడీ ఇంకా ఎమోషన్స్ కూడా ఇందులో మెప్పిస్తాయి. కాకపోతే కొంచెం ఊహాజనిత కథనం మైనస్ అనిపిస్తుంది. ఇది తప్పిస్తే ఈ చిత్రం ఆడియెన్స్ ని మెప్పిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు