‘కపుల్ ఫ్రెండ్లీ’ మొదటి రోజు కలెక్షన్స్ ఇవే !

‘కపుల్ ఫ్రెండ్లీ’ మొదటి రోజు కలెక్షన్స్ ఇవే !

Published on Feb 15, 2026 2:15 PM IST

couple-friendly-Movie-1

సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “కపుల్ ఫ్రెండ్లీ”. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. పైగా ఈ సినిమాకి మంచి సమీక్షలు వచ్చాయి. ఈ చిత్రం ప్రీమియర్లతో సహా ప్రపంచవ్యాప్తంగా రూ. 1.89 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రానికి సానుకూల మౌత్ టాక్ రావడంతో ఈ రోజు కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

మొత్తానికి ఈ ‘కపుల్ ఫ్రెండ్లీ’ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. డీసెంట్ గా సాగే ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా మెప్పించింది. సంతోష్ శోభన్, మానస వారణాసి మెచ్యూర్ పెర్ఫామెన్స్ లతో ఈ సినిమా స్థాయిని పెంచారు. అందుకే, రోజురోజుకు ఈ సినిమాకి కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మరోవైపు ప్రభాస్ కూడా ఈ సినిమా పై పాజిటివ్ కామెంట్స్ చేయడం కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది.

తాజా వార్తలు