విషాదం: ప్రముఖ నిర్మాత మృతి !

విషాదం: ప్రముఖ నిర్మాత మృతి !

Published on Feb 15, 2026 5:02 PM IST

thamilazhagan

తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సూపర్‌హిట్‌ మూవీ ‘బాషా’ చిత్ర నిర్మాత తమిళగన్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో శనివారం ఆయన మరణించారు. ఆయన మృతి పట్ల రజనీకాంత్‌ సంతాపం ప్రకటించారు. సోదరుడిలాంటి అళగన్ మృతి తనకు అత్యంత బాధాకరమని, తమిళగన్ మంచి వ్యక్తి అని రజనీకాంత్ తెలిపారు. నిర్మాత తమిళగన్ కుటుంబానికి రజనీకాంత్ సానుభూతి తెలిపారు.

ఈరోజు సాయంత్రం తమిళగన్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రజనీకాంత్‌ హీరోగా సురేశ్‌ కృష్ణ తెరకెక్కించిన ‘బాషా’ను తన తల్లి రాజమ్మాళ్‌తో కలిసి నిర్మించారు. ఆయన మరణం పట్ల పలువురు తమిళ సినీ ప్రముఖులు, ప్రేక్షకులు సంతాపం తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మా 123తెలుగు.కామ్ తరఫున నిర్మాత తమిళగన్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

తాజా వార్తలు