టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi ), విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో మరో హిలేరియస్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం ఒక వెరైటీ టైటిల్‌ను కూడా సిద్ధం చేశారట. టైటిల్ వినగానే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగేలా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం.
ఈ ప్రాజెక్టులో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇందులో వెంకటేష్‌తో పాటు మరో హీరో బావమరిది పాత్రలో కనిపించబోతున్నారు. మొదట మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ పేరు వినిపించినా, ప్రస్తుతం అనిల్ రావిపూడి చూపు తమిళ హీరో కార్తీ వైపు మళ్లింది. కార్తీకి తెలుగులో ఉన్న క్రేజ్, మార్కెట్ దృష్ట్యా ఆయనైతే ఈ పాత్రకు పర్ఫెక్ట్ అని చిత్ర యూనిట్ భావిస్తోంది. గతంలో ‘ఊపిరి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కార్తీ, ఈ ప్యూర్ కామెడీ జానర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సినిమా రేంజ్ డబుల్ అవ్వడం ఖాయం.
ప్రస్తుతం కార్తీ వరుసగా సీరియస్ రోల్స్ చేస్తున్నారు, కాబట్టి అనిల్ రావిపూడి మార్క్ ఫన్ మూవీ ఆయనకు ఒక మంచి ఛేంజ్ అవుతుంది. సాహు గారపాటి నిర్మాణంలో రానున్న ఈ చిత్రాన్ని ఉగాదికి గ్రాండ్‌గా లాంచ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్‌లో బిజీగా ఉన్న వెంకటేష్, ఆ వెంటనే ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. త్వరలోనే ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


