రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘టాక్సిక్’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
టాక్సిక్ చిత్ర టీజర్‌ను ఫిబ్రవరి 20న ఉదయం 9.35 గంటలకు విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించిన పోస్టర్‌లో యష్ ఒక పవర్‌ఫుల్ అండ్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ టీజర్ ద్వారా సినిమా అసలు కథేంటి, యష్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
ఈ సినిమాలో కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. మరి టాక్సిక్ టీజర్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.
9:35 AM | 20.02.2026#ToxicTeaser#Toxic In Cinemas Worldwide from 19-03-2026@TheNameIsYash#Nayanthara@humasqureshi @advani_kiara @rukminitweets #TaraSutaria #GeetuMohandas @RaviBasrur #RajeevRavi #UjwalKulkarni #TPAbid #MohanBKere #SandeepSadashiva #PrashantDileepHardikar… pic.twitter.com/HxWOLm08u1
— KVN Productions (@KvnProductions) February 19, 2026


