థియేటర్స్ లో రజినీ, కమల్ సంచలన కలయిక ప్రోమో.. గెట్ రెడీ!

థియేటర్స్ లో రజినీ, కమల్ సంచలన కలయిక ప్రోమో.. గెట్ రెడీ!

Published on Feb 20, 2026 5:27 PM IST

KH x RK

ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి దిగ్గజ స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే కమల్ హాసన్ లు కూడా ఒకరు. అయితే ఎన్నో దశాబ్దాల కితం వచ్చినట్టుగా ఇప్పుడు అలాంటి మల్టీస్టారర్ చిత్రాలు పడడం లేదు. కానీ ఫైనల్ గా ఏకంగా 47 ఏళ్ళు తర్వాత రజినీ, కమల్ ల సంచలన కలయిక సాధ్యం అయ్యింది. ఇక ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా మేకర్స్ ప్రెజెంట్ చేస్తుండగా రేపు ఫిబ్రవరి 21న ప్రోమోని వదులుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు.

అయితే ఈ ప్రోమో రిలీజ్ కోసం మరో క్రేజీ స్టెప్ ని మేకర్స్ తీసుకున్నారు. ఈ ప్రోమోని రేపు అదే సమయానికి థియేటర్స్ లో ప్రదర్శితం చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసి కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ వరకు బుకింగ్స్ చేసుకోవచ్చని తెలిపారు. దీనితో బిగ్ స్క్రీన్స్ పై మళ్ళీ ఈ భారీ మల్టీస్టారర్ కలయికని విట్నెస్ చేయొచ్చు అని చెప్పాలి. ఇక ఈ సినిమా దర్శకుడు ఎవరు, సంగీతం వగైరా అంశాలు రేపటితోనే ఓ కొలిక్కి కూడా రావచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు