R రేటెడ్ తో వస్తున్న మాస్ కా దాస్.. ‘కల్ట్’తో షాకింగ్ ప్లానింగ్!

R రేటెడ్ తో వస్తున్న మాస్ కా దాస్.. ‘కల్ట్’తో షాకింగ్ ప్లానింగ్!

Published on Feb 20, 2026 9:00 PM IST

Cult

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక దాని నుంచి వెంటనే బయటకి వచ్చిన విశ్వక్ తన ‘కల్ట్'(Cult) చూపించేందుకు సిద్ధం అయ్యాడు. తన దర్శకత్వంలోనే చేస్తున్న సాలిడ్ క్రైమ్ థ్రిల్లర్ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేస్తుండగా ఈ టీజర్ కోసం ఊహించని ప్లానింగ్ తాను చేయడం గమనార్హం.

ఈ టీజర్ ని ఏకంగా R రేటెడ్ తో దింపుతుండడం గమనార్హం. మన ఇండియన్ సినిమా దగ్గర ఆర్ రేటెడ్ అనేది చాలా అరుదు. ఇప్పుడు వచ్చిన టాక్సిక్ టీజర్, ధురంధర్ లాంటి సినిమాల్లో వైలెన్స్ కే ఏ రేటింగ్ ని ఇచ్చారు. అలాంటిది విశ్వక్ సేన్ ఆర్ రేటింగ్ ని ప్లాన్ చేస్తున్నాడంటే ఇందులో ఎలాంటి వైలెన్స్, సీన్స్ ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. మరి రేపు వచ్చే ఆ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా సందీప్ కాకర్ల నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు