ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న నవీన్ చంద్ర హార్రర్ మూవీ ‘హనీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడుంటే..?

ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న నవీన్ చంద్ర హార్రర్ మూవీ ‘హనీ’.. స్ట్రీమింగ్ ఎప్పుడుంటే..?

Published on Feb 21, 2026 11:02 PM IST

Honey Movie Review

టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటించిన రీసెంట్ మూవీ ‘హనీ’(Honey) ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. దర్శకుడు కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ హార్రర్ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో మంచి బజ్ మధ్య రిలీజ్ అయింది. కానీ, అనుకున్న స్థాయిలో ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకోలేకపోయింది.

అయితే, ఇప్పుడు ఈ చిత్రం నెల రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ‘హనీ’ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సన్ నెక్స్ట్‌లో ఫిబ్రవరి 27 నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇక ఈ సినిమాలో నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. క్షుద్రపూజలు, చేతబడులు అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా మేకర్స్ రూపొందించారు. మరి ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

తాజా వార్తలు