ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ రెండుసార్లు చనిపోదాం అనుకున్నారట !

ఆ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ రెండుసార్లు చనిపోదాం అనుకున్నారట !

Published on Feb 22, 2026 12:00 PM IST

ravi basrur

సౌత్ లో రవి బస్రూర్ కూడా మంచి మ్యూజిక్ డైరెక్టర్. ముఖ్యంగా ‘కేజీఎఫ్’ మ్యూజిక్‌తో ఆయనకు భారీ ఇమేజ్ వచ్చింది. పైగా ఆ తర్వాత ‘సలార్’ సంగీతంతో మరోసారి రవి బస్రూర్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రవి బస్రూర్ ‘కల్ట్’ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఐతే, ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో రవి బస్రూర్ తన జీవితంలోని చీకటి రోజులను గుర్తు చేసుకుని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ, రవి బస్రూర్ ఏం మాట్లాడారు అంటే.. ‘ఒక సినిమాకి మంచి మ్యూజిక్ ఇవ్వడానికి నేను 24 గంటలు పనిచేస్తాను. ఐతే, నాకు 18 ఏళ్ల వయసున్నప్పుడు రెండుసార్లు చనిపోదాం అనుకున్నాను. రెండోసారి సూసైడ్ నుంచి నన్ను రవి అనే వ్యక్తి కాపాడారు. అప్పటి నుంచి నా పేరు రవి బస్రుర్ అని మార్చుకున్నాను. ఇక ఫస్ట్ టైమ్ ఒకరు, రవి బస్రుర్ ని కాకుండా నా సోల్ ని చూశారు. నా సోల్ ని, సంగీతం పట్ల నాకున్న డెడికేషన్ ని అప్రిసియేట్ చేశాడు. అది విశ్వక్‌ సేన్. అందుకే ఆయనకు నేను థ్యాంక్స్‌ చెబుతున్నా’ అంటూ రవి బస్రూర్ కామెంట్స్ చేశాడు.

తాజా వార్తలు