సామ్ ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

సామ్ ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Published on Feb 22, 2026 3:00 PM IST

Maa Inti Bangaram

స్టార్ హీరోయిన్ సమంత మన తెలుగు సినిమాకి దూరం అయ్యి చాలా కాలమే అయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఖుషి సినిమా తర్వాత ఆమె నుంచి వస్తున్న అవైటెడ్ చిత్రమే “మా ఇంటి బంగారం”. ఈ సినిమా అనౌన్సమెంట్ అప్పుడే మంచి బజ్ క్రియేట్ చేసింది. కానీ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఫైనల్ గా ఈ సినిమా రిలీజ్ కి ఇపుడు డేట్ వచ్చేసింది.

సమంతపై ఒక హోమ్లీ పోస్టర్ తో ఈ మే నెల 15న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఇందులో సమంత క్రేజీ రోల్ ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య వచ్చిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి ఆల్రెడీ సామ్ తో ఓ బేబీ సినిమా చేసిన మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించారు. అలాగే సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా త్రలాల మూవింగ్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

తాజా వార్తలు