మాస్ మహారాజా రవితేజ హీరోగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi) సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఓటీటీ తొలి ప్రదర్శన కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ లోకి వచ్చింది. కానీ ఇంకా ఓటీటీలోకి రాలేదు. కొన్ని రోజుల క్రితం, ఇతర భాషా వెర్షన్ల డబ్బింగ్ పనులలో జాప్యం కారణంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఆలస్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఐతే, ఈ సినిమా డబ్బింగ్ పనులతో పాటు, ఓటీటీ ఒప్పందానికి సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీలు కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ఇప్పుడు మార్చి 2026కి వాయిదా పడిందని టాక్. ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 కలిగి ఉంది. ఈ సినిమాలో కామెడీ ఎలిమెంట్స్ బాగానే వర్కౌట్ అయింది.


