పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తన హిట్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన సినిమా “ఉస్తాద్ భగత్ సింగ్”. ఈ సినిమాలో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవని, పవన్‌కల్యాణ్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ మోడ్‌లో చూస్తారని దర్శకుడు హరీశ్ శంకర్ తాజాగా స్పష్టత ఇచ్చారు. ఈ మూవీ నుంచి ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటను విడుదల చేశారు. దీంతో ప్రస్తుత రాజకీయాలపై ఈ సినిమాలో సెటైర్లు, విమర్శలు ఉంటాయని పలువురు భావిస్తుండటంతో దీనిపై హరీశ్ శంకర్ స్పష్టతనిచ్చారు.
‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటకు మంచి స్పందన వస్తోంది. అభిమానులు వాళ్ల ఎడిట్స్ పంపిస్తుంటే ఆనందంగా ఉంది. ఇక ఈ సినిమా మొదలు పెట్టిన దగ్గరి సినిమా, రాజకీయాలు వేర్వేరని పవన్‌కల్యాణ్‌గారు మాతో చెబుతూనే వచ్చారు. ఆయనా అదే పాటించారు. సైద్ధాంతిక విభేదాలు ఉన్నా పక్కనపెట్టి ప్రకాశ్‌రాజ్‌తో పవన్‌కల్యాణ్ నటించారు. వ్యక్తిగతంగా ఆయన ఎవరినీ టార్గెట్ చేయరు’ అని హరీష్ శంకర్ తెలిపారు. ఈ చిత్రం మార్చి 26, 2026న థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.


