ఇప్పుడు ఇండియన్ సినిమా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచే దాదాపు ఉంటాయి. అలా ప్రభాస్ నుంచి రానున్న సీక్వెల్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ కల్కి పార్ట్ 2 (Kalki 2) కూడా ఒకటి. మొదటి పార్ట్ ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి దుమ్ము లేపింది. ఇక ఫైనల్ గా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న ఈ సినిమా ఎట్టకేలకి షూటింగ్ మొదలు పెట్టుకుంది.
కమల్, అమితాబ్ సీన్స్ తో మొదలు..
ఇటీవలే హైదరాబాద్ శంకరపల్లి ప్రాంతంలో ఈ సినిమా (Kalki 2898 AD Part 2) షూటింగ్ ని మొదలు పెట్టారు. అయితే ప్రభాస్ లేని సీన్స్ తో ఈ షూట్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ లో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ల సన్నివేశాలతో మొదలు పెట్టినట్టు తెలిసింది.
Kamal Haasan, Amitabh Pics – సెట్స్ నుంచి కమల్, అమితాబ్ పిక్స్ వైరల్
ఈ భారీ సినిమాలో కమల్ హాసన్ పవర్ఫుల్ విలన్ సుప్రీం యాస్కిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అశ్వత్థామగా అమితాబ్ నటిస్తున్నారు. మరి సెట్స్ నుంచి ఈ ఇద్దరి పిక్స్ బయటకి వచ్చాయి. ఇందులో అమితాబ్ తన మేకోవర్ కోసం లుక్ మార్చేశారు. అలాగే అమితాబ్ అయితే అశ్వత్థామ గెటప్ లోనే దర్శనమిచ్చారు. ఇలా ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటున్న ఎపిక్ ఫ్రేమ్ సినీ వర్గాల్లో ఇప్పుడు వైరల్ గా మారాయి.


