విజయ్, రష్మికల పెళ్లి.. వారికి మోడీ నుంచి లేఖ వైరల్!

విజయ్, రష్మికల పెళ్లి.. వారికి మోడీ నుంచి లేఖ వైరల్!

Published on Feb 25, 2026 12:00 PM IST

VIROSH

మన టాలీవుడ్ యువ జంట సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నాలు చాలా కాలం రిలేషన్ షిప్ తర్వాత ఎట్టకేలకి తమ పెళ్లికి సిద్ధం అయ్యారు. ఆల్రెడీ ఉదయ్ పూర్ లో కుటుంబీకులు, స్నేహితుల హంగామా ఆల్రెడీ మొదలైంది. ఇక ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనేకమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా ఈ వివాహ ఉత్సవానికి హాజరు కానున్నారు.

అయితే ఈ జాబితాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానాన్ని యువ జంట పంపించగా వారికి మోడీ నుంచి ఓ లేఖ పంపడం ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ లేఖలో “శ్రీమతి మాధవి మరియు శ్రీ గోవర్ధన్ రావు దేవరకొండ గారికి, ఫిబ్రవరి 26, 2026న జరగనున్న విజయ్ మరియు రష్మికల వివాహ వేడుకకు నన్ను ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆనందకరమైన మరియు పవిత్రమైన సందర్భంలో దేవరకొండ మరియు మందన్న కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు.

ఇది విజయ్ మరియు రష్మికల జీవితంలో ఒక కొత్త, అందమైన అధ్యాయానికి ఆరంభం. ‘సఖా సప్తపదా భవ’ అనే స్ఫూర్తితో, ఏడడుగులు కలిసి నడిచిన ఈ జంట జీవితాంతం స్నేహితులుగా ఉంటారు. రాబోయే రోజులు, నెలలు మరియు సంవత్సరాలు వారి ఉమ్మడి కలలతో మరియు వాటి నెరవేర్పుతో నిండిపోవాలని కోరుకుంటున్నాను. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, లోపాలను సైతం ప్రేమతో స్వీకరిస్తూ, ఒకరి బలాన్ని చూసి మరొకరు నేర్చుకుంటూ నిజమైన భాగస్వాములుగా వారి జీవిత ప్రయాణం సాగాలి. ఈ చిరస్మరణీయ సందర్భంలో ఆ జంటకు మరియు వారి కుటుంబ సభ్యులకు నా ఆశీస్సులు, శుభాకాంక్షలు.” అంటూ మోడీ తెలిపారు. దీనితో ఈ లెటర్ సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

v

తాజా వార్తలు