పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. మాస్ లో మంచి బజ్ ఉన్న ఈ సినిమా రిలీజ్ కి ఇంకా నెల మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ నెక్స్ట్ ఓవర్సీస్ ఇతర రాష్ట్రాల్లో రిలీజ్ కోసం కొంచెం క్లారిటీ బయటకి రావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఉస్తాద్ కర్ణాటక రిలీజ్ కి సంబంధించి క్రేజీ న్యూస్ ఒకటి తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకు వచ్చినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ వచ్చింది అంటే సినిమా కన్నడలో కూడా డబ్బింగ్ ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.


