‘ధురంధర్ 2’ ఫస్ట్ రివ్యూ.. ఎప్పటికీ మర్చిపోలేరు ..!

‘ధురంధర్ 2’ ఫస్ట్ రివ్యూ.. ఎప్పటికీ మర్చిపోలేరు ..!

Published on Feb 28, 2026 9:01 AM IST

Dhurandhar 2

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘ధురంధర్’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇక దీనికి సీక్వెల్‌గా వస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’ మార్చి 19న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే, ధురంధర్ 2 (Dhurandhar 2) మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్చింది దర్శకుడు ఆదిత్య ధర్ భార్య, నటి యామీ గౌతమ్. ఆమె ఈ సినిమాపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తాను ఇప్పటికే ‘ధురంధర్ 2’ సినిమా చూశానని, ఇది నెక్స్ట్ లెవెల్ మూవీ అని.. ప్రేక్షకులు ఈ అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఈ సినిమా చూశాక తాను వేరే దేనిపై కూడా దృష్టి పెట్టలేకపోయానంటూ పేర్కొంది.

‘ఆర్టికల్ 370’ షూటింగ్ సమయంలోనే ఈ కథ విన్నానని, అది తనను కన్నీళ్లు పెట్టించిందని యామీ తెలిపింది. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ చిత్రం ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. దీంతో ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) మూవీపై ఆమె ఇచ్చిన రివ్యూ ఇప్పుడు అభిమానుల్లో మరింత అంచనాలు క్రియేట్ చేసింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు