SPIRIT: హాయ్ చెప్పి ఆశ పెట్టకు.. బాయ్ చెప్పి బాధ పెట్టకు..

SPIRIT: హాయ్ చెప్పి ఆశ పెట్టకు.. బాయ్ చెప్పి బాధ పెట్టకు..

Published on Mar 2, 2026 12:00 AM IST

spirit

ప్రస్తుతం పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న ‘స్పిరిట్’ కోసం చూస్తున్న ఫ్యాన్స్ పరిస్థితి దాదాపు ఇదే అని చెప్పొచ్చు. ప్రభాస్ నుంచి వస్తున్న అన్ని సినిమాల్లో దీనిపై నెక్స్ట్ లెవెల్ హైప్ బిల్డ్ అయ్యి ఉంది. ఈ సినిమా విషయంలో అందరికీ అత్యంత ఎక్కువగా ఎగ్జైట్ చేసిన అంశం ఏదన్నా ఉంది అంటే అది కొరియన్ బాలయ్య డాన్ లీ కూడా ఉన్నాడు అనే మాటే అని చెప్పాలి.

ఈ సినిమా పాన్ ఇండియా భాషలతో పాటుగా ఆసియన్ భాషలు జాపనీస్, కొరియన్ భాషల్లో కూడా ఈ సినిమాని మొదట అనౌన్స్ చేసిన తర్వాత నెమ్మదిగా డాన్ లీ ప్రెజెన్స్ కోసం టాక్ రావడంతో ఈ ప్రాజెక్ట్ సెన్సేషనల్ హైప్ ని సెట్ చేసేసుకుంది. దీంతో ఇలాంటి మ్యాడ్ కాంబినేషన్ లో సినిమా కోసం ఒక్క అభిమానులే కాకుండా ఇండియన్ ఆడియెన్స్ కూడా ఎగ్జైట్ అయ్యారు.

ఇక తర్వాత డాన్ లీ ప్రభాస్ సలార్ సినిమా కోసం పోస్ట్ చేయడం మన తెలుగు సినిమా నటులు కూడా డాన్ లీ ను కలవడం వంటివి తెలుగు ఆడియెన్స్ లో ఆశలు మరింత ఎక్కువ చేసేశాయి. ఇలా ఒక వెంట్రుకవాసి దూరంలో ఈ నటుడు టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. పైగా సందీప్ రెడ్డి వంగ కూడా డాన్ లీ ప్రస్తావనపై ఖండించకపోవడం ఆశలకు మరింత బలాన్ని చేకూర్చింది.

కానీ లేటెస్ట్ గా విలన్ రోల్ లో వివేక్ ఓబెరాయ్ ని అనౌన్స్ చేయడంతో అప్పుడు ఇచ్చిన ఆశలు అన్నిటిని వెనక్కి లాక్కొని బాధపెట్టినంత పనయ్యింది. అసలు ఇన్ని రోజులు ఇచ్చిన హైప్ కి ఆ అప్డేట్ కి పొంతన లేకపోయేసరికి డాన్ లీ ఉన్నాడో లేదో అనేది ఒక క్లారిటీ ఇచ్చేయాలని ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. ఉంటే ఓకే లేకపోతేనే ఇంకా ఎక్కువ బాధ పడాల్సి ఉంటుంది అని ప్రిపేర్ అవుతున్నారు. మరి మేకర్స్ దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తారో లేదో చూడాల్సిందే.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు