మెగాస్టార్ ఊచకోత.. 109 కేంద్రాల్లో 50 రోజులు.. ‘MSG’ సరికొత్త రికార్డ్!

మెగాస్టార్ ఊచకోత.. 109 కేంద్రాల్లో 50 రోజులు.. ‘MSG’ సరికొత్త రికార్డ్!

Published on Mar 2, 2026 12:00 PM IST

MSG

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త చరిత్ర సృష్టించింది. షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, నేటి ఓటీటీ కాలంలోనూ ఏకంగా 109 కేంద్రాల్లో 50 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుని తన సత్తా చాటింది.

ఈ సినిమా చిరంజీవి మరియు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే మొదటి రూ.400 కోట్ల ఆల్ టైమ్ రీజనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం థియేటర్లలోనే కాకుండా, జీ5 ఓటీటీలో కూడా నెంబర్ 1 పొజిషన్‌లో ట్రెండ్ అవుతూ రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో $3.5 మిలియన్ల వసూళ్లు సాధించడమే కాకుండా, బుక్ మై షోలో అత్యధికంగా 3.8 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడైన ప్రాంతీయ చిత్రంగా నిలిచింది.

మెగాస్టార్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌కు తోడు విక్టరీ వెంకటేష్, నయనతారల నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అనిల్ రావిపూడి మార్క్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు