మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “డ్రాగన్” కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో తారక్ స్లిమ్ లుక్ లో మైంటైన్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆఫ్ లైన్ లో తాను షూట్ కి వెళుతున్నపుడో లేక షూట్ అయ్యాక ఫోటోలు ఏమన్నా బయటికి వచ్చాయి తప్పితే సెట్స్ నుంచి మాత్రం చిన్న లీక్ కూడా లేకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు.
అయితే మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యేవరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి లీక్ రాకుండా ఉండాలని చూస్తున్నారట. ముఖ్యంగా అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ ఏమాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా వదిలే ఫస్ట్ లుక్ దెబ్బకి మొత్తం సమీకరణాలు మార్చాలని గట్టిగానే మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సో ఈ మే 20నే ఒక ఊహించని విస్ఫోటనం ఇంటర్నెట్ ని బ్రేక్ చేయనుంది అని చెప్పవచ్చు.


