మహిళా దినోత్సవం నాడు తారక్ మెసేజ్.. నా పిల్లలకి ఇదే నేర్పిస్తా!

మహిళా దినోత్సవం నాడు తారక్ మెసేజ్.. నా పిల్లలకి ఇదే నేర్పిస్తా!

Published on Mar 9, 2026 12:00 AM IST

ntr

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇప్పుడు భారీ చిత్రం దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా గ్యాప్ లో లేటెస్ట్ గా ఓ హాస్పిటల్ ఓపెనింగ్ కి తను ప్రత్యేకంగా హాజరు కావడం జరిగింది. అయితే అక్కడ స్పీచ్ లో తారక్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. నేడు ప్రపంచ మహిళా దినోత్సవం అని అందరికీ తెలిసిందే.

ఈ ప్రత్యేక దినాన తారక్ మహిళల పట్ల తనకి ఉన్న గౌరవంని వ్యక్త పరిచాడు. మహిళలని గౌరవించాలి అని ప్రతీరోజు గుర్తు చేయడం కాదు అది మనకి పుట్టుకతోనే రావాలి అని తన ఇద్దరు కొడుకులకు కూడా ఆడవారిని ఎలా గౌరవించాలి అనే విధంగా వారిని పెంచుతాను అని తారక్ మాటిస్తున్నట్టు తెలిపాడు. దీనితో తన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు