GMAA ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శిరీష సమర్పణలో రూపొందుతున్న నూతన చిత్రం “R” పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. గోలి రామకృష్ణ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓపెనింగ్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో జరిగింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రానున్న ఈ చిత్రానికి గాలి బాల కిరణ్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ నెల 20 నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు. కేవలం రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసి, ఇదే ఏడాది అక్టోబర్ 17న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో సంతోష్ కృష్ణన్, భాగ్య రెడ్డి, బ్రహ్మానందం రెడ్డి, పవన్, సిరి, భాను చందర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశోక రెడ్డి కంకల్ల సినిమాటోగ్రాఫర్‌గా, మునీష్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత గోలి రామకృష్ణ మాట్లాడుతూ.. “ఇదొక మంచి సందేశాత్మక చిత్రం. ఇతర వివరాలను త్వరలోనే విభిన్నమైన శైలిలో ప్రకటిస్తాం” అని తెలిపారు. దర్శకుడికి సినిమాపై ఉన్న మక్కువ వల్లే పూజా కార్యక్రమాల రోజే విడుదల తేదీని సైతం ప్రకటించామని సహ నిర్మాత గాలి బాల కిరణ్ రెడ్డి పేర్కొన్నారు.


