రియల్ స్టంట్స్ మోడ్‌తో మళ్లీ ట్రెండింగ్ అవుతున్న మంచు మనోజ్

రియల్ స్టంట్స్ మోడ్‌తో మళ్లీ ట్రెండింగ్ అవుతున్న మంచు మనోజ్

Published on Mar 10, 2026 11:34 PM IST

Manoj

మంచు మనోజ్ సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్ అవుతున్నాడు. తన నెక్స్ట్ ప్రాజెక్టుల కోసం ఆయన చేస్తున్న ఫిజికల్ ట్రాన్స్‌‌ఫార్మేషన్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘గత మూడు వారాలుగా సౌకర్యాలకు దూరంగా, ఎలాంటి సాకులు చెప్పకుండా కష్టపడుతున్నాను. యాక్షన్ సినిమాల్లో షార్ట్‌కట్‌లు ఉండవు, కెమెరా అబద్ధం చెప్పదు’ అంటూ తన ట్రాన్స్‌ఫార్మేషన్ జర్నీని ఆయన పంచుకున్నాడు. ప్రస్తుతం కేవలం లుక్స్ కోసం కాకుండా, పవర్‌ఫుల్ స్టంట్స్ చేసేందుకు అవసరమైన సత్తువ కోసం ‘అన్‌బ్రేక్ బుల్’ లక్ష్యంతో ట్రెయినింగ్ పొందుతున్నట్లు పేర్కొన్నాడు.

ఇటీవలే ‘మిరాయ్’ చిత్రంలో బ్లాక్ స్వోర్డ్ మహాబీర్ లామాగా పవర్‌ఫుల్ విలన్ పాత్రలో మెప్పించిన మనోజ్, తన సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్నాడు. ఆ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకుల నుండి మరియు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు అదే ఉత్సాహంతో తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన ‘డేవిడ్ రెడ్డి’ కోసం సిద్ధమవుతున్నాడు.

హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో పీరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘డేవిడ్ రెడ్డి’ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. 1897-1920 మధ్య బ్రిటిష్ కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ 10 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ భారీ చిత్రంతో పాటు మంచు మనోజ్ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

తాజా వార్తలు