విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహం ఇటీవల ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారీగా హాజరై సందడి చేశారు.
తాజాగా రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తన మెహందీ వేడుకకు సంబంధించిన కొన్ని అన్‌సీన్ ఫోటోలను పంచుకుంది. ఇందులో తన మరిది ఆనంద్ దేవరకొండ మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఒక ఫోటో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్యూట్ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇక సినిమాల పరంగా రష్మిక మరియు విజయ్ దేవరకొండ కలిసి నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ పై భారీ అంచనాలు ఉన్నాయి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.


