చిరు టు బాలయ్య.. రౌండ్స్ కొడుతున్న డైరెక్టర్..?

చిరు టు బాలయ్య.. రౌండ్స్ కొడుతున్న డైరెక్టర్..?

Published on Mar 11, 2026 2:00 AM IST

Balakrishna and Chiranjeevi

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NBK 111’ షూటింగ్ పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. అయితే, దీనితో పాటు మరో కొత్త సినిమాను కూడా సమాంతరంగా మొదలుపెట్టాలని బాలయ్య భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు దర్శకులు ఆయనకు కథలు వినిపిస్తున్నారు.

ఇప్పటికే కొరటాల శివ, హరీష్ శంకర్, వివేక్ ఆత్రేయ వంటి దర్శకులు బాలయ్యను కలిశారు. తాజాగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట కూడా ఈ రేసులోకి వచ్చారు. వశిష్ట చెప్పిన లైన్ బాలయ్యకు బాగా నచ్చడంతో, ప్రస్తుతం ఆయన పూర్తి స్క్రిప్ట్‌పై కసరత్తు చేస్తున్నారు. గతంలో వశిష్ట రవితేజకు కూడా ఒక కథ వినిపించినప్పటికీ, ఇప్పుడు బాలయ్య ప్రాజెక్టుపైనే అందరి దృష్టి నెలకొంది.

తన తదుపరి సినిమా ఎవరితో ఉండబోతుందనే విషయంపై ఉగాది తర్వాత బాలయ్య ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. జూన్ నెలలో కొత్త సినిమాను ప్రారంభించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అప్పటి వరకు ఈ క్రేజీ దర్శకులలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందో వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు