పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు రెడీ అవుతుంది. దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో దర్శకుడు హరీష్ శంకర్ ఫుల్ జోష్‌తో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్‌తో పాటు బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్ 2’ మూవీతో పోటీపై రెస్పాండ్ అయ్యాడు.
బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్ 2’ మూవీ పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ అవుతుందని.. అయితే, తమ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మాత్రం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఫోకస్ పెట్టినట్లు హరీష్ శంకర్ అన్నారు. ‘ధురంధర్ 2’ సినిమాతో తమ సినిమా పోటీ పడటం లేదని ఆయన తెలిపారు. ఆదిత్య ధర్ మంచి విజన్ ఉన్న డైరెక్టర్ అని.. ఆయన తెరకెక్కించిన చిత్రాలను తాను చూశానని హరీష్ శంకర్ పేర్కొన్నారు.
మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ ఫోకస్ కేవలం తెలుగు రాష్ట్రాలపైనే ఉందని.. ‘ధురంధర్ 2’ లాంటి పాన్ ఇండియా చిత్రంతో తమకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని హరీష్ శంకర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.


