ప్రతి శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర ఏదో ఒక సినిమా రిలీజ్ అయ్యి సందడి చేయడం కామన్. ఇక పండుగ సీజన్ టైమ్‌లో బాక్సాఫీస్ దగ్గర సినిమాలు పోటీ పడి మరీ రిలీజ్ అవుతుంటాయి. కానీ, ఈ మార్చి రెండో వారంలో మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ బోసిపోనుంది.
మార్చి తొలివారంలో ‘మృత్యుంజయ్’తో పాటు మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. కానీ, ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు మార్చి రెండో వారంలో ఎలాంటి సినిమాలు కూడా రిలీజ్ కావడం లేదు. ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకపోవడంతో ఈ శుక్రవారం టాలీవుడ్ బాక్సాఫీస్ ఖాళీగా మిగిలిపోనుంది.
థియేటర్లలో కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో ఉన్న సినిమాలే తమ రన్ కంటిన్యూ చేయాలని చూస్తున్నాయి. ఇక ఉగాది పర్వదినం కానుకగా మార్చి 19న రెండు బడా సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో చూడాలి.


