ఇళయ దళపతి విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన భారీ చిత్రమే “జన నాయగన్’. ఇదే విజయ్ కి ఆఖరి సినిమా కాగా దీనిని తెలుగులో జన నాయకుడు పేరిట కూడా డబ్ చేశారు. అంతా బాగానే ఉంది ఈ సంక్రాంతికి రిలీజ్ పక్కా అనుకున్న సమయంలో ఒకొక్కటిగా ఈ సినిమాకి చిక్కులు ఎదురయ్యాయి. వీటితో ఈ సినిమా రిలీజ్ అగమ్య గోచరంగా మారిపోయింది.
ఇక అక్కడ నుంచి ఇప్పటికీ ఏదొక అడ్డంకి సినిమాకి కొనసాగుతుంది. మరి ఈ సినిమాకి లేటెస్ట్ ఓటిటి చిక్కులు మొదలైనట్టు తెలుస్తుంది. ఈ సినిమా హక్కులు ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకోగా వారు ఈ సినిమా డీల్ ని ఇప్పుడు రద్దు చేస్తున్నట్టు టాక్ సినీ వర్గాల్లో చర్చకి దారి తీసింది. ఈ సినిమా విడుదల, తాము అనుకున్న షెడ్యూల్ కి రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా ఓటిటి డీల్ ని రద్దు చేసుకున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.


