‘అల్లు సినిమాస్’ లో డాల్బీ సినిమా ఎక్స్ పీరియెన్స్ అద్భుతం.. ఒక్కసారైనా చూడాల్సిందే!

‘అల్లు సినిమాస్’ లో డాల్బీ సినిమా ఎక్స్ పీరియెన్స్ అద్భుతం.. ఒక్కసారైనా చూడాల్సిందే!

Published on Mar 13, 2026 5:00 PM IST

allu-cinemas

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అలాగే ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ ఫ్యాషనేటెడ్ నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ ల కుటుంబం నుంచి వచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నే ‘అల్లు సినిమాస్’. ఇండియన్ సినిమా దగ్గర అతి పెద్ద డాల్బీ సినిమాస్ తెరను తీసుకొచ్చి సినిమా చూసే ఆడియెన్స్ కి ఒక అద్భుతమైన అనుభూతి చెందాలనే కారణంతో వారిది తీసుకొచ్చారు. అయితే నేడు ప్రత్యేకంగా మీడియా వారికి ఆహ్వానం అందింది. అందులో భాగంగా అల్లు సినిమాస్ వరల్డ్ లోకి అడుగు పెట్టడం జరిగింది.

మొత్తం 4 స్క్రీన్ లు..

హైదరాబాద్ లోనే ట్రిపుల్ ఏ (AAA) అనే మల్టీప్లెక్స్ కూడా అల్లు అర్జున్ కి ఉంది కానీ ఈ అల్లు సినిమాస్ అనేది పూర్తిగా భిన్నం. ఇది కేవలం అల్లు కుటుంబం వారు తమకి ఉన్న విజన్, సినిమా పట్ల ఉన్న అత్యంత అంకితభావంతోనే నిర్మించడబడింది. ఇందులో మొత్తం 4 స్క్రీన్స్ ఉంటే వాటిలో మూడు 4కే లేజర్ ప్రొజెక్షన్ తో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టంతో సినిమాలు ప్రదర్శితం చేయనున్నాయి. ఇవి స్క్రీన్ 2, 3, 4 గా సెట్ చేశారు.

స్క్రీన్ 1 ‘డాల్బీ సినిమాస్’

ఇదే అల్లు సినిమాస్ లో మెయిన్ హైలైట్ స్క్రీన్. ఇది ఇండియా లోనే అతిపెద్ద డాల్బీ సినిమా తెర. ఇది భారీ మొత్తంలో 75 అడుగుల తెర 4కే లేజర్ ప్రొజెక్షన్ మరియు ఏకంగా 644 మంది ఒకేసారి కూర్చొనగలిగే సీటింగ్ కెపాసిటీతో తీసుకొచ్చారు. అయితే ఇందులో డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం అయితే చూసే ఆడియెన్ లో అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది.

మొత్తం 360 డిగ్రీలలో చుట్టూ డాల్బీ అట్మాస్ స్పీకర్స్ తో నింపేసి ఒక కంప్లీట్ ఎక్స్ పీరియన్స్ ని అల్లు సినిమాస్ అందించారు. వీటితో పాటుగా అసలు సిసలు హైలైట్, ఆ స్క్రీన్ మరియు ప్రొజెక్షన్. ఒక్కసారి ఈ స్క్రీన్ లో గనుక ఒక సరైన డాల్బీ సినిమాస్ వెర్షన్ సినిమా చూస్తే మీరు ఇప్పటివరకు చూసిన సినిమాల ఎక్స్ పీరియెన్స్ అంతా ఒకెత్తు డాల్బీ సినిమాస్ లో ఎక్స్ పీరియెన్స్ అంతా ఒకెత్తు అని చెప్పకుండా ఉండలేరు. అంత అద్భుతంగా ఇందులో తెరపై సినిమా కనిపిస్తుంది. చూసే ఆడియెన్ ని లీనం అయ్యేలా చేస్తుంది. చాలా క్లియర్ గా సినిమా ఇందులో ఎక్స్ పీరియెన్స్ చేయొచ్చు. దీనిలో సినిమా కోసం చెప్తే కాదు చూస్తేనే దాని విలువ ఏంటి అనేది అర్ధం అవుతుంది.

సో ఇలా ఒక్క ఇండియాలోనే కాకుండా ఆసియాలోనే ఎక్కడా లేని విధమైన ప్రయత్నాన్ని అల్లు వారు చేయడం నిజంగా హర్షణీయం. ఆల్రెడీ బుకింగ్స్ మొదలయ్యాయి. ఒక పర్ఫెక్ట్ సినిమాని ఇక్కడ ప్లాన్ చేసుకొని చూడండి, ఇంచ్ కూడా డిజప్పాయింట్ కారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు